HomeTelugu Trendingదిశా పటానీని అభిమానులు ఏంచేశారంటే..!

దిశా పటానీని అభిమానులు ఏంచేశారంటే..!

11 13
బాలీవుడ్‌ అందాల నటి దిశా పటానికి తన పుట్టిన రోజు చేదు అనుభవం ఎదురైంది. దిశా తరుచూ వెళ్లే బేస్టియన్‌ రెస్టారెంట్‌కి తన బాయ్‌ ఫ్రెండ్‌ టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి వెళ్లింది. అయితే ఆమె రాక తెలుసుకున్న అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడానికి ఎగబడ్డారు. అభిమానులు ఆమెను
చుట్టుముట్టారు. ఒక్కసారిగా అందరూ దగ్గరికి రావడంతో ఆమె కిందపడబోయారు. దీంతో వెంటనే ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ టైగర్‌ ష్రాఫ్‌ ఆమెను పడిపోకుండా చేయిపట్టుకుని రక్షించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. టైగర్‌ ష్రాఫ్‌తో పాటు సన్నిహితుల మధ్య దిశా పుట్టిన రోజును జరుపుకుంది. ఇటీవల సల్మాన్‌ ఖాన్‌ భారత్‌ మూవీలో దిశా పటాని నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం దిశాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

11a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu