HomeTelugu Big Storiesకేంద్రంపై ఏపీ టీడీపీ ఎంపీల మండిపాటు

కేంద్రంపై ఏపీ టీడీపీ ఎంపీల మండిపాటు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలకు విరుద్ధంగా సుప్రీం కోర్టులో ప్రతికూలంగా కేంద్రం నివేదిక దాఖలు చేయడంపై టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, మురళీ మోహన్, అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ప్రయత్నిస్తోందని, అసలు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏం చేయదలచుకుందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కోలా చూస్తోందని, విభజన హామీల అమలు అంశంపై సుప్రీంలో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ అసంబద్ధంగా ఉందని మండిపడ్డారు.

10

నాలుగేళ్లలో యూసీల అంశాన్ని ప్రస్తావించని కేంద్రం మేము ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాతే యూసీలు అడుగుతున్నారని సుజనా చౌదరి ఆరోపించారు. రైల్వేజోన్‌పై నాలుగేళ్ల పాటు నిర్ణయం తీసుకోలేని మోదీ సర్కారు.. దేశాన్ని ఏం పాలించగలదని తెదేపా ఎంపీలు ప్రశ్నించారు. దుగరాజపట్నం పోర్టుపై స్పష్టమైన వైఖరి చెప్పడం లేదని, స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్‌ నివేదిక సానుకూలంగా ఉన్నప్పటికీ కేంద్రం గోడమీద పిల్లిలా వ్యవహరిస్తోందని ఎద్దేవాచేశారు. భాజపా రాష్ట్ర నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. విశాఖ రైల్వేజోన్‌ ఇస్తామని చెప్పి.. మూడు రోజుల్లోనే అఫిడవిట్‌లో మాట మార్చారని మరో ఎంపీ అవంతి శ్రీనివాస్‌ అన్నారు. 4 డివిజన్లు ఉన్నప్పటికీ రైల్వేజోన్‌ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. జోన్‌ ఇవ్వడానికి కావాల్సిన అన్ని వసతులూ విశాఖలో ఉన్నాయన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu