HomeTelugu Big Stories'డీజే టిల్లు' ట్రైలర్‌

‘డీజే టిల్లు’ ట్రైలర్‌

DJ Tillu movie Trailer
సిద్దు జొన్నలగడ్డ, నేహా శర్మ హీరో హీరోయిన్‌లుగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డీజే టిల్లు’. ‘అట్లుంటది మనతోని’…అనేది దీనికి ట్యాగ్ లైన్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ తో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. ఇక వన్ మ్యాన్ షో అన్నట్లు సిద్దు నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. హీరోయిన్ ని పడేయడానికి బన్నీ పేరును వాడడం వినోదాన్ని తెప్పిస్తోంది. హైదరాబాదీ యాసలో టిల్లు డైలాగ్ లు అదిరిపోయాయి. మొత్తానికి ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇక నేహా అందాలు, లిప్ లాక్ లు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఎస్ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా ఈ నెలలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

రవితేజ సినిమాతో హీరో వేణు రీఎంట్రీ!

Recent Articles English

Gallery

Recent Articles Telugu