HomeTelugu Trendingరవితేజ సినిమాతో హీరో వేణు రీఎంట్రీ!

రవితేజ సినిమాతో హీరో వేణు రీఎంట్రీ!

Hero venu in Ravi Teja movi

టాలీవుడ్‌ సీనియర్‌ హీరో వేణు తొట్టెంపూడి పేరు వినగానే ‘స్వయంవరం’ సినిమా గుర్తుకు వస్తుంది. ఆ తరువాత వచ్చిన ‘హనుమాన్ జంక్షన్’, ‘ పెళ్ళాం ఊరెళితే’ వంటి సినిమాలు ఆయనకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఒక వైపున సోలో హీరోగా .. మరో వైపున మల్టీ స్టారర్ చిత్రాలు చేస్తూ ఆయన ప్రేక్షకులను అలరించాడు.

ఆ తరువాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగాను కనిపించాడు. కెరియర్ పరంగా బిజీగా ఉండగానే ఆయన సినిమాలకి దూరమయ్యాడు. మళ్లీ రీ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ హీరోగా చేస్తున్న ‘ధమాకా’ సినిమాలో వేణు ఒక కీలకమైన పాత్రను చేయనున్నట్టుగా చెబుతున్నారు.

నక్కిన త్రినాథరావు డైరెక్షన్‌ వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఒక కీలకమైన పాత్ర కోసం మరో హీరో ఉంటే బాగుంటుందని అనుకున్నారట. అలా ఇటీవల కొంతమంది హీరోల పేర్లు వినిపించాయి. తాజాగా వేణు పేరు తెరపైకి వచ్చింది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu