HomeTelugu Trendingఆ సీన్స్‌లో నటించనున్న కాజల్‌?

ఆ సీన్స్‌లో నటించనున్న కాజల్‌?

Does Kajal agree with the b
డిజిటల్ రంగం వైపు స్టార్‌ హీరోయిన్‌లు కూడా మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే హీరోయిన్‌లు సమంత, రాధికా ఆప్టే, తమన్నా, శ్రుతిహాసన్ ఎంట్రీ ఇచ్చారు. ప్రియాంక చోప్రా.. కంగన రనౌత్ లాంటి స్టార్లు డిజిటల్ మార్కెట్ పై కన్నేసి జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రయత్నాలతో వేడెక్కించేస్తున్నారు. ఇప్పుడు ఇదే బాటలో టాలీవుడ్‌ చందమామ కాజల్ కూడా ఓ అంతర్జాతీయ ఓటీటీ సిరీస్ లో నటించనుందని తెలుస్తోంది. వెబ్ సిరీస్ అంటేనే అందాల విందు. కాజల్ ఇక ఎలాంటి మొహమాటం లేకుండా వెబ్ సిరీస్ లలో అందాలు ఆరబోయనుందట. అందుకు ఇప్పటికే ఓ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందని తెలుస్తోంది. ప్రియాంక చోప్రా నటించిన బ్లాక్ బస్టర్ ఇంటర్నేషనల్ సిరీస్ క్వాంటికో తెలుగు సహా సౌత్ రీమేక్ లో కాజల్ నాయికగా నటించనుందని ప్రచారమవుతోంది.

ఇక క్వాంటికో సిరీస్ అంటే హీటెక్కించే సీన్లు ఎన్నో ఉన్నాయి. బెడ్ రూమ్ సన్నివేశాలు సహా బాత్రూమ్ సన్నివేశాలు కూడా ఇంతకుముందు హీటెక్కించాయి. అయితే వీటికి కాజల్ అంగీకరిస్తుందా? అన్నది అభిమానుల సందేహం. కాగా ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ హీరోయిన్‌గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu