HomeTelugu Trendingగోపాల గోపాల డైరెక్టర్‌తో పవన్‌ కల్యాణ్‌ సినిమా!

గోపాల గోపాల డైరెక్టర్‌తో పవన్‌ కల్యాణ్‌ సినిమా!

4 4
పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత నుండి వరుసగా సినిమాలుకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే వేణుశ్రీరాం దర్శకత్వం లో ‘వకీల్ సాబ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్ ను విడుదల చేసారు. ఈ లుక్ కి విపరీతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ తో సినిమా చేస్తున్నాడు పవన్. క్రిష్‌తో పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుట్లు తెలుస్తుంది. పీరియాడిక్ స్టోరీతో ఈ సినిమా రానుంది. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్, త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా లిస్ట్ లో మరో దర్శకుడి పేరు కూడా వినిపిస్తుంది. పవన్‌కి ‘గోపాలా గోపాల’ వంటి హిట్ ఇచ్చిన డాలీతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడట. పవన్ కోసం ఒక స్టోరీని కూడా సిద్ధం చేస్తున్నాడట డాలీ. అన్నీ కుదిరితే 2021 మధ్యలో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈవార్తల పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu