HomeTelugu Trending'భీష్మ' నుండి లవర్స్‌ డే గిఫ్ట్‌ వచ్చేసింది

‘భీష్మ’ నుండి లవర్స్‌ డే గిఫ్ట్‌ వచ్చేసింది

3 13
యంగ్‌ హీరో నిత్‌ని, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. రష్మిక నితిన్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. విభిన్న కథతో ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘భీష్మ’ సినిమాని ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఇటీవల చిత్రబృందం ‘భీష్మ’ నుంచి సింగిల్స్‌ యాంథమ్‌ లిరికల్‌ను విడుదల చేయగా.. దానికి మంచి స్పందన లభించింది.ఇదిలా ఉండగా శుక్రవారం లవర్స్‌ డే సందర్భంగా ‘సింగిల్స్‌ యాంథమ్‌’ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో నితిన్‌ వింటేజ్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఈ వీడియోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన రష్మిక.. ‘హ్యాపీ సింగిల్స్‌ డే, హ్యాపీ వాలెంటైన్స్‌ డే..!! ఈ వీడియో సాంగ్‌ను చూసి ఆనందించండి. ‘భీష్మ’ జీవిత కథ ఇదే’ అని అన్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu