HomeTelugu Trendingదుబాయ్ షేక్ నోట.. బాలు పాట.. వీడియో వైరల్‌

దుబాయ్ షేక్ నోట.. బాలు పాట.. వీడియో వైరల్‌

Dubai sheikh songs sirivenn
తెలుగు పాట‌ల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్రపంచంలో ఏమూలనైనా ఎక్కడో చోట తెలుగు పాట వినిపిస్తూనే ఉంటుంది. ప్రాంతాలు, దేశాలు అందుకు అడ్డుకట్ట కాబోవని తాజాగా ఓ దుబాయ్ షేక్ నిరూపించారు. కె విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో కేవీ మ‌హ‌దేవ‌న్ సంగీత సారథ్వంలో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి క‌లం నుంచి జాలువారిన ‘విధాత త‌ల‌పున‌…’ అనే పాట ఎంత హిట్ అయిందో చెప్ప‌క్క‌ర్లేదు.

లెజెండ్ సింగర్ ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆల‌పించిన ఈ పాట‌ను ఇప్పుడు దుబాయ్‌కు చెందిన ఓ షేక్ పాడి వినిపించారు. టిక్‌టాక్ కోసం పాడిన ఈ పాట సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న‌ది. సంగీతంపై ఆయ‌న‌కున్న మక్కువ‌ను తెలియ‌జేసింది. సంగీతానికి భాషాబేధాలు లేవ‌ని, నేర్చుకోవాల‌నే త‌ప‌న ఉంటే చాలని నిరూపించాడు దుబాయ్ షేక్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu