HomeTelugu Newsడబ్బింగ్‌ కార్యక్రమాల్లో 'ఒక్కడొచ్చాడు'!

డబ్బింగ్‌ కార్యక్రమాల్లో ‘ఒక్కడొచ్చాడు’!

మాస్‌ హీరో విశాల్‌, తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా డబ్బింగ్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా.. నిర్మాత జి.హరి మాట్లాడుతూ.. ”ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో డబ్బింగ్‌ జరుగుతోంది. జగపతిబాబుగారు, బ్రహ్మానందంగారు, జె.పి.గారు డబ్బింగ్‌ పూర్తి చేశారు. మిగతా ఆర్టిస్టుల డబ్బింగ్‌ జరుగుతోంది. నవంబర్‌ 7న ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ చేసి, నవంబర్‌ 18న వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇందులోని పాటలు, యాక్షన్‌ సీక్వెన్స్‌లు, ఛేజ్‌లను చాలా రిచ్‌గా తియ్యడం జరిగింది. సినిమాకి అవి చాలా పెద్ద హైలైట్‌ అవుతాయి. హిప్‌హాప్‌ తమిళ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఒక డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో రూపొందిన ఈ సినిమా విశాల్‌ కెరీర్‌లోనే కాస్‌ట్లియస్ట్‌ మూవీ. మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం విశాల్‌కి మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది. నవంబర్‌ మొదటి వారంలో ఆడియోను రిలీజ్‌ చేసి, నవంబర్‌ 18న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu