HomeTelugu News'మాస్టర్‌' విజయ్‌ పాడిన 'కుట్టి స్టోరీ' పాట వచ్చేసింది..

‘మాస్టర్‌’ విజయ్‌ పాడిన ‘కుట్టి స్టోరీ’ పాట వచ్చేసింది..

16 3
‘ఇళయ దళపతి’ విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనకరాజు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మాస్టర్‌’. ఆండ్రియా, మాళవిక మోహనన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజయ్‌ సేతపతి విలన్‌గా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో విజయ్‌ ఆలపించిన ‘కుట్టి స్టోరీ’ పాట లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలకు అనురాజా కామరాజ్‌ సాహిత్యం అందించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అంతేకాదు, ఈ లిరికల్‌ వీడియోను డిజైన్‌ చేసిన విధానమూ ఆకట్టుకుంటోంది. అనిరుధ్‌ ‘వై దిస్‌ కోలవెరి’ని గుర్తు చేస్తోంది. ఏప్రిల్‌ 9న సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu