టీడీపీ నేతలకు మావోయిస్టుల హెచ్చరిక..!


విశాఖలోని ముగ్గురు టీడీపీ నేతలకు మావోయిస్టులు హెచ్చరికలు పంపారు. మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిలకు హెచ్చరిక పేరుతో మన్యంలో ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. సీపీఐ మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం పేరుతో ఈ లేఖ ఉంది. “ఆదివాసీల ఓట్లతో గెలిచిన మీరు ఆదివాసీలను ఏం పట్టించుకుంటున్నారు? మే 1న వంచుల పంచాయతీలోని పనసలొద్ది, కొత్త వెదురుపల్లి గ్రామాలపై పోలీసులు దాడులు చేసి.. ఆరుగురు రైతులను అక్రమంగా నిర్బంధించారు. పోలీసులు వారిని చిత్రహింసలకు గురిచేశారు. వారిని విడిచిపెట్టాలని గ్రామస్తులు గూడెం పోలీసులు చుట్టూ తిరిగినా వీరిని పట్టించుకునే వారు లేరని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు.