HomeTelugu Big Storiesదుల్కర్ సల్మాన్ సీతారామం టీజర్ విడుదల

దుల్కర్ సల్మాన్ సీతారామం టీజర్ విడుదల

Sita Ramam Teaser

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న ప్రేమకథా చిత్రం ‘సీతా రామం’. యుద్ధంతో రాసిన ప్రేమకథ ట్యాగ్ లైన్. మృణాల్ ఠాకూర్ కథానాయిక. ఈ చిత్రాన్ని అశ్వనీదత్ – స్వప్న కలిసి నిర్మించారు. కశ్మీర్ ప్రాంతంలో పనిచేసే సిపాయిగా ఈ సినిమాలో దుల్కర్ కనిపించనున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం.

తనకు ఎవరూ లేరంటూ ఒంటరితనంతో బాధపడుతున్న యువకుడికి నీ భార్య సీతామహాలక్ష్మిని అంటూ ఒక యువతి నుంచి ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరం ఎవరు రాశారనేది అతనికి తెలియదు. సీత ఎవరనేది తెలియదు. అప్పుడు అతను ఏం చేశాడనేదే కథ అనే విషయం టీజర్ ద్వారా తెలుస్తోంది. 1965 కాలం నాటి కథతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రష్మిక, సుమంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్ 5న తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu