HomeTelugu Trendingనాగమ్మగా మంచులక్ష్మి నటవిశ్వరూపం

నాగమ్మగా మంచులక్ష్మి నటవిశ్వరూపం

Manchu Lakshmi Adi Parvam m

టాలీవుడ్‌ నటి మంచులక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపర్వం’. 5 భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నాడు. హైటెన్షన్ యాక్షన్ ఫిలింగా దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలతోపాటు హిందీలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా హిట్‌ అవుతుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

అనగనగా ఒక ధీరుడు సినిమా తర్వాత ఆ స్థాయిలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఆదిపర్వం మూవీ ఉంటుందంట. ఇక ఈ సినిమాలో మంచు లక్ష్మి ఎంతో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ చేసిందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత గంటా శ్రీనివాసరావు తెలిపారు. గ్రాఫిక్స్ వర్క్ ప్రస్తుతం జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

ఈ సినిమాలో మంచులక్ష్మితోపాటు ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, యోగికాత్రి, గడ్డం నవీన్, ఢిల్లీరాజేశ్వరి తదితరులు నటిస్తున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాలో నాగమ్మగా మంచులక్ష్మి పరకాయ ప్రవేశం చేసిందని, ఆమె పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని, ఇందులో రెండు ఫైట్స్ ఉంటాయని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu