HomeTelugu Trendingఆసక్తికరంగా లక్కీ భాస్కర్‌ ఫస్ట్‌లుక్‌

ఆసక్తికరంగా లక్కీ భాస్కర్‌ ఫస్ట్‌లుక్‌

Dulquer Salmaan Lucky Bhaskమలయాళీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో మహునటి, సీతారామం సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం దుల్కర్‌ తెలుగులో ఒక సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకి ‘లక్కీ భాస్కర్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు.

మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఈ నేప‌థ్యంలో మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్‌. డబ్బు కట్ల మధ్యలో నడుచుకుంటూ వస్తున్న ఈ లుక్‌ నెటజన్లను ఆకట్టుకుంటుంది. దీంతో ఈ సినిమా మనీ చూట్టూ తిరుగనున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్ బ్యాంకు ఉద్యోగిగా క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu