HomeTelugu Trending'అశ్వద్ధామ'కి పవన్‌ వాయిస్‌ ఓవర్‌.!

‘అశ్వద్ధామ’కి పవన్‌ వాయిస్‌ ఓవర్‌.!

3 26
యంగ్‌ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘అశ్వద్ధామ’. నాగశౌర్య సొంత బ్యానర్లో మెహ్రీన్ హీరోయిన్‌గా నిర్మితమైన ఈ సినిమా ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ తో మొదలవుతుందనేది తాజా సమాచారం.

పవన్ వాయిస్ ఓవర్ తో ఈ కథ మొదలుకానుండటం, ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ వున్న నాగశౌర్య తొలిసారిగా పూర్తిస్థాయి యాక్షన్ మూవీ చేయడం విశేషం. యాక్షన్ కి ఎమోషన్ ను జోడిస్తూ ఆయన రాసిన ఈ కథ పట్ల ఆయన పూర్తి నమ్మకంతో వున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కి .. ట్రైలర్ కి మంచి సందన వచ్చింది. అందువలన ఈ సినిమా తప్పకుండా భారీ హిట్ కొడుతుందని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu