దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా ప్రి లుక్ విడుదల


మలయాళం స్టార్ దుల్కర్ స‌ల్మాన్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌కు అనుబంధంగా స్థాపించిన స్వప్న సినిమా బ్యానర్‌పై ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కుతోంది. ఇవాళ (జులై 28) దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ లుక్‌ను విడుదల చేశారు. దుల్కర్ ఒక ఆర్మీ‌ మేన్‌గా క‌నిపిస్తుండ‌గా, రెండు చేతులు క‌లుసుకున్నట్లు ఇమేజ్.. సినిమాలోని ప్రేమను ప్రతిబింభిస్తోంది. పోస్టర్‌లో ‘యుద్ధంతో’ రాసిన ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ ఉంది. 1964 కాలంలో జ‌రిగే పీరియ‌డ్ ల‌వ్ స్టోరీగా రూపొందే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ప్రియాంకా ద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు నేరుగా తెలుగులో సినిమా చేస్తున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates