HomeTelugu Trending'శాకిని డాకిని' మూవీ టీజర్‌ విడుదల

‘శాకిని డాకిని’ మూవీ టీజర్‌ విడుదల

Saakini Daakini Official Te

రెజీనా కసాండ్రా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘శాకిని డాకిని’. దక్షిణ కొరియా చిత్రం ‘మిడ్‌నైట్‌ రన్నర్‌’కి తెలుగు రీమేక్‌ ఇది. సుధీర్‌ వర్మ డైరెక్షన్‌ లో వస్తున్న ఈ సినిమాకి.. డి. సురేశ్‌ బాబు, సునీత తాటి, హ్యూన్వూ థామస్‌ కిమ్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్‌ 16న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్‌.

టీజర్‌ను బట్టి చూస్తే, సినిమాలో వినోదం, యాక్షన్, బలమైన కథ, డ్రామా ఉన్నట్లు తెలుస్తోంది. థ్రిల్లర్‌లను హ్యాండిల్ చేయడంలో దిట్ట అయిన సుధీర్ వర్మ ఈ సబ్జెక్ట్‌ని డీల్ చేయడంలో తనదైన మార్క్ చూపించాడు. ఈ చిత్రానికి రిచార్డ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్‌ కాగా, మైకీ మెక్‌క్లియరీ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu