HomeTelugu Trending'డంకి' ట్రైలర్‌ విడుదల

‘డంకి’ ట్రైలర్‌ విడుదల

dunki movie treiler releaseబాలీవుడ్‌ హీరో షారుక్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’ హిట్‌లతో మంచి జోరుమీదున్నాడు. ఈ నేపథ్యంలో షారుక్ నుంచి రావడానికి ఇప్పుడు మరో సినిమా రెడీ అవుతోంది .. అదే ‘డంకి’. షారుక్ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ సినిమాకు, రాజ్ కుమార్ హిర్వాణి దర్శకత్వం వహించాడు.

ఈ నెల 21వ తేదీన పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ ప్రధానంగా ఈ కథ నడుస్తుందని ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.

షారుక్ పాత్రలోని వేరియేషన్స్ ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఈ సినిమాలో తాప్సి , విక్కీ కౌశల్, బొమన్ ఇరాని ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ప్రీతం బాణీలను స్వరపరచగా, అమన్ పంత్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu