HomeTelugu Trendingసైనికుడి బయోపిక్‌లో నాని

సైనికుడి బయోపిక్‌లో నాని

Nani movie with goutham thi

నేచురల్‌ స్టార్‌ నాని వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘టక్‌ జగదీశ్‌, శ్యామ్‌ సింగరాయ, అంటే సుందరానికి’ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. దీంతో పాటు మరో ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి- నాని కాంబినేషన్‌లో వచ్చిన ‘జర్సీ’ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇదిలా ఉండగా వీరిద్దరి కాంబినేషన్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ రూపొందనునున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా దీనిని నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఓ రియల్‌ హీరో జీవిత కథ ఆధారంగా బయోపిక్‌కు డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి ప్లాన్‌ చేస్తున్నాడట. యుద్దంలో కాళ్లు కోల్పోయిన ఓ సైనికుడి నిజ జీవిత చరిత్ర ఆసధారంగా ఈ ప్రాజెక్ట్‌ రూపొందనుందట. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ బయోపిక్‌ను దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నట్లు టాక్‌. అంతేగాక దీనికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ను కూడా ప్రారంభించినట్లు సిని వర్గాల నుంచి సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu