HomeTelugu Trendingబింబిసార: ఫస్ట్‌ సింగిల్‌ విడుదల

బింబిసార: ఫస్ట్‌ సింగిల్‌ విడుదల

Eeswarude Lyrical Video fro
నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బింబిసార’. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది దీనికి ట్యాగ్ లైన్. ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్, వారీనా హుస్సేన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ‘ఈశ్వరుడే’ అనే ఫస్ట్ సింగిల్‌ విడుదల చేశారు. ‘భువి పై ఎవడూ కనివిని ఎరుగని అద్భుతమే జరిగినే.. దివిలో సైతం కథగా రాని విధి లీలే వెలిగినే..’ అంటూ సాగిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు చిరంతన్ భట్ స్వరాలు సమకూర్చగా.. కాల భైరవ ఆలపించారు.

ఈ సినిమాతో మల్లిడి వశిష్ఠ్ అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా 2022 ఆగస్ట్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu