HomeTelugu Trendingరికార్డు బ్రేక్ చేసిన విజయ్‌దేవరకొండ.. సౌత్‌లో ఇతనే ఫస్ట్‌

రికార్డు బ్రేక్ చేసిన విజయ్‌దేవరకొండ.. సౌత్‌లో ఇతనే ఫస్ట్‌

Eight million followers for

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సోషల్‌ మీడియాలో రికార్డు బ్రేక్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హీరోకు ఫాలోవర్లు 8 మిలియన్లు దాటారు. ఇప్పటి వరకు దక్షిణాదిలో ఏ నటుడికీ ఈ స్థాయిలో ఫాలోవర్లు లేరు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వైరల్ చేస్తున్నారు. కాగా, విజయ్ దేవరకొండకు ట్విట్టర్‌లో 1.7 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 3.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ 10వ సినిమా చేస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం విజయ్ థాయిలాండ్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పీసీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్ ముందు వరకు ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌లోనే షూటింగ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu