HomeTelugu Trendingహీరోయిన్‌గా సాయిపల్లవి చెల్లెలు!

హీరోయిన్‌గా సాయిపల్లవి చెల్లెలు!

Sai pallavi sister entry as

ఫిదా బ్యూటీ సాయిపల్లవి చెల్లెలు పూజా కణ్ణన్‌ కూడా అక్క బాటలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ‘యమదొంగ’, ‘ఏ మాయ చేశావె’, ‘2.0’, ‘మాస్టర్‌’… ఇలా పలు చిత్రాలకు స్టంట్‌ మాస్టర్‌గా చేసిన స్టంట్‌ శివ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ద్వారా పూజా కణ్ణన్‌ హీరోయిన్‌గా చేయనున్నట్లు సమాచారం. శివకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. ఇందులో ఆయన ఓ కీలక పాత్ర కూడా చేయనున్నారు. సముద్రఖని మరో కీలక పాత్రలో నటించనున్నాడు. దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ ఈ చిత్రానికి కథ–స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. ఆయన దర్శకత్వంలో సాయిపల్లవి ‘కరు’ (తెలుగులో ‘కణం’) అనే సినిమాలో నటించారు. అలాగే ఏఎల్‌ విజయ్‌ దగ్గర అసిస్టెంట్‌గా డైరెక్టర్‌గా చేశారు పూజా కణ్ణన్‌. ఐదేళ్ల క్రితం ‘కారా’ అనే షార్ట్‌ ఫిలింలో నటించారు పూజ. మరి పూజా కణ్ణన్‌ వెండితెర అరంగేట్రం షురూ అవుతుందా? వేచి చూద్దాం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu