HomeTelugu Trendingఅమిగోస్: 'ఎన్నో రాత్రులొస్తాయి గానీ' సాంగ్‌ ప్రోమో

అమిగోస్: ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ’ సాంగ్‌ ప్రోమో

Enno Ratrulosthayi song Pr

నందమూరి కళ్యాన్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమిగోస్‌’. రాజేంద్ర రెడ్డి డెరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని మైత్రి మేకర్స్‌ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ఈ క్రమంలో ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ’ రీమేక్‌ సాంగ్‌ ప్రోమోను విడుదల చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్రం ఈ సినిమాలో ఈ పాట అప్పట్లో మంచి హిట్‌గా నిలించింది.

ఈ ఒరిజినల్‌ సాంగ్‌ను ఎస్పీ బాలు ఆలపించారు. ఇళయరాజా స్వరపరిచారు. ఈ రీమిక్స్ సాంగ్‌ను ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ పాడటం విశేషం. సమీరా భరద్వాజ్‌ ఎస్పీ చరణ్‌తో కలిసి ఆలపించారు. ఈ సాంగ్‌లో హీరోయిన్‌ గ్లామర్‌ పరంగా ఆకట్టుకుంది. మరీ ఈ రీమేక్‌ సాంగ్‌ ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్‌, సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. ఈసినిమాలో త్రిపాత్రాభినయంలో నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu