HomeTelugu Newsరాజమండ్రిలో 'ఎంత మంచివాడవురా' షూటింగ్‌

రాజమండ్రిలో ‘ఎంత మంచివాడవురా’ షూటింగ్‌

14 5కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎంత మంచివాడవురా’. శతమానం భవతి ఫేమ్ వేగేశ్న సతీష్‌ దర్శకత్వంలో సుభాష్‌ గుప్త, శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి, గోదావరి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం ఒక స్పెషల్ సాంగ్ ను షూట్ చేసిన యూనిట్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో ఒక ఫైట్ సీన్ ను తెరకెక్కిస్తోంది. స్టంట్‌ మాస్టర్‌ వెంకట్‌ నేతృత్వంలో పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఆపదలో ఉన్నవాళ్లకు సహాయం చేసే మైండ్ సెట్ కల అబ్బాయికి కోపం వచ్చింది.. అది ఎవరి మీద ఎందుకు? అనేది వెండితెరపై చూడాలని చెబుతున్నారు. మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ‘జై సింహా’ ఫేమ్‌ నటాషా దోషి ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu