ప్రభాస్‌కు నిహారిక సలహా ఏంటి?

ఇప్పుడు ప్రభాస్ పెళ్లి గురించే సినీ జనాలు జోరుగా చర్చించుకుంటున్నారు. అంతేకాదు, ఫలానా అమ్మాయితో ప్రభాస్‌కు పెళ్లి కుదిరిందంటూ పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా అనుష్క, నిహారికల పేరుతో ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి. ఇటీవల పుట్టిన రోజు జరుపుకున్న హీరో ప్రభాస్‌కు అభిమానుల నుంచి శుభాకాంక్షలతో పాటు పెళ్లెప్పుడు అనే ప్రశ్నలు కూడా బాగానే వచ్చాయి. దీంతో ప్రభాస్ వారికి సమాధానం ఇవ్వడానికి కాస్త ఇబ్బందిపడినా.. త్వరలోనే అంటూ సూచనలిచ్చాడు. ఈ తరుణంలో మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన నిహారిక కొణిదెల.. ప్రభాస్‌కు లేఖ రాసిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


నిహారిక.. ప్రభాస్ ప్రేమలో పడిందని, త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నిహారిక లేఖ మరింత ఆసక్తి కలిగిస్తోంది. ఓ వెబ్‌సైట్ కథనం ప్రకారం.. ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన నిహారిక త్వరగా పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కావాలని సలహా ఇచ్చిందంట. కెరీర్ కోసం పెళ్లిని వాయిదా వేసుకోవద్దని సూచించిందట.

“నువ్వు పెళ్లి విషయాన్ని ఆలస్యం చేస్తే.. అది హాట్ న్యూస్ అవుతుంది. తెలుగు మీడియాలోనే కాదు, నేషనల్ మీడియాలో కూడా. నీకు గుర్తుందా? కొద్ది రోజుల కిందట మనం ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నాం అనే వార్తలు కూడా వచ్చాయి. ఈ రూమర్లు అన్నింటికీ పుల్‌స్టాప్ పెట్టాలంటే.. నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి. త్వరగా పెళ్లి చేసుకుని అందరినీ సంతోషపెట్టు” అని పేర్కొంది. ఈ లేఖపై ప్రభాస్ స్పందిస్తూ.. “మీ కోరికను ఈ ఏడాది చివరికల్లా నెరవేరుస్తా” అని సమాధానం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించనున్నట్టు తెలుస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates