HomeTelugu Trendingఈటీ మూవీ ట్రైలర్‌

ఈటీ మూవీ ట్రైలర్‌

ET movie Trailer

కోలీవుడ్ స్టార్ హీరో​ సూర్యకు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. మాస్ పాత్రల్లోనే కాకుండా, క్లాస్‌, వైవిధ్యమైన పాత్రల్లో అదరగొడుతుంటాడు. సూర్య ఈసారి మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకృత్యాలు, దారుణాలను ఎండగట్టే ప్రయత్నం చేయబోతున్నాడు. సూర్య పాండిరాజ్​ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో ‘ఎతర్​క్కుమ్​ తునిందవన్ (ఈటీ)’. మాస్​ యాక్షన్​ సినిమాగా వస్తున్న ఈటీలో అరుల్​ మోహన్ హీరోయిన్​గా నటించింది.

బుధవారం (మార్చి 2) ఉదయం ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేశారు మేకర్స్​. ‘వాడేమె సైంటిస్ట్​ కావాలని ఆశ పడ్డాడు. నేనేమో వేరేలే చూడాలని ఆశపడ్డాను. కానీ దైవం, కాలం వాడ్ని​ ఇలా చూడాలని ఆశపడింది’ అనే డైలాగ్​తో సినిమా ట్రైలర్​ ప్రారంభమవుతోంది. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా చూపించారు. ‘ఆడవాళ్లు అంటే బలహీనులు కాదు బలవంతులు’, ‘పంచె ఎగ్గడితే నేనే జడ్జి’ వంటి తదితర డైలాగ్​లు​ ఆకట్టుకున్నాయి. పాన్​ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 10న థియేటర్లలో విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu