Homeతెలుగు Newsబీజేపీ తెలివి తక్కువ విధానాలతో దేశం అతలాకుతలం

బీజేపీ తెలివి తక్కువ విధానాలతో దేశం అతలాకుతలం

9 18

బీజేపీ తెలివితక్కువ విధానాలతో దేశం అతలాకుతలమైందని, రానున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న విషయంపై సంక్రాంతి నాటికి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని మాజీ ఎంపీ డాక్టర్‌ చింతామోహన్‌ స్పష్టం చేశారు. నాలుగున్నరేళ్ల బీజేపీ పాలనలో ధరలు, నిరుద్యోగం, పేదరికం విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. ప్రధాని మోడీ విద్యావంతుడు కాకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపించారు. కేవలం నాలుగో తరగతి చదివిన వ్యక్తి ప్రధాని కావడం దేశ దౌర్భాగ్యమన్నారు.

దేశప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ప్రధాని రాని యుద్ధాలకు పోయిన చోటల్లా విమానాలు కొనుగోలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో దేశ ఆర్థిక పరిస్థితి విచ్చిన్నమైందని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో స్థానాలు పెరిగాయన్నారు. రైతుబంధు, 25 గంటల ఉచిత విద్యుత్‌, వృద్ధాప్య పించన్ల పెంపు, ఎంఐఎంతో పొత్తు తదితర అంశాలు కాంగ్రెస్‌ ఓటమికి కారణమయ్యాయన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, 2 లక్షల వరకు రైతురుణమాఫీ, చేనేత రుణమాఫీ అమలు చేస్తామన్నారు.

వెంకటగిరి, గూడూరు, శ్రీకాళహస్తి ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా తాను సాధించిన మన్నవరంలో బెల్‌ కర్మాగారం, నడికుడి రైలు మార్గం, దుగరాజుపట్టణం ఓడరేవు నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం నిదులు మంజూరు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటన్నిటికీ కార్యరూపం కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. రాపూరు – సైదాపురం మధ్యలో కేద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu