HomeTelugu Trendingమహేశ్‌ బాబుకి ఫ్యాన్స్‌ అరుదైన బహుమతి.. నక్షత్రానికి సూపర్‌ స్టార్‌ పేరు

మహేశ్‌ బాబుకి ఫ్యాన్స్‌ అరుదైన బహుమతి.. నక్షత్రానికి సూపర్‌ స్టార్‌ పేరు

exceptional gift by Superst

సూపర్ స్టార్ మహేశ్ బాబుకి మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఈ రోజు మహేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌ ఆయనకు అరుదైన బహుమతి ఇచ్చారు. ఒక నక్షత్రానికి ఆయన పేరును రిజిస్టర్ చేశారు. ఈ విషయాన్ని గ్లోబల్ స్టార్ రిజిస్ట్రేషన్ సంస్థ కూడా అధికారికంగా ప్రకటించింది. ‘RA:12H33M29S’ అనే నక్షత్రానికి మహేశ్ బాబు పేరును పెట్టినట్లు వెల్లడించింది.

ఇక మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు పోటెత్తాయి. ఆయన ఎప్పుడూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలంటూ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, డైరెక్టర్ హరీశ్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరో విజయ్ దేవరకొండ తదితర ఎంతో మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక ప్రస్తుతం ఫ్యామిలీ వెకెషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఇండియా తిరిగి వచ్చిన తరువాత ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్‌లో పాల్గోననున్నారు. త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu