కల్యాణ్‌రామ్‌ ‘118’ సినిమా కోసం వస్తున్న బాలయ్య, తారక్‌

హీరో కల్యాణ్‌రామ్‌ కోసం ఆయన బాబాయి నందమూరి బాలకృష్ణ, సోదరుడు తారక్‌ కలిసి రాబోతున్నారు. కల్యాణ్‌రామ్‌ నటించిన మూవీ ‘118’. కేవీ గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. షాలినీ పాండే, నివేదా థామస్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మహేశ్‌ కొనేరు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయట. ఫిబ్రవరి 28న అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్‌ షో నిర్వహించబోతున్నారు. నిర్వాణ సినిమాస్ సంస్థ ఈ‌ చిత్రాన్ని విదేశాల్లో విడుదల చేయబోతోంది. మార్చి 1న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కాగా ఫిబ్రవరి 25న ‘118’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించబోతున్నారు. దీనికి బాలకృష్ణ, తారక్ ముఖ్య‌ అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత మహేశ్‌ కోనేరు ట్విటర్‌ వేదికగా తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ ప్రచార చిత్రంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.