HomeTelugu Big Storiesపుష్ప: ‘ఏ బిడ్డ ఇది నా అడ్డ‌’సాంగ్‌ వచ్చేసింది

పుష్ప: ‘ఏ బిడ్డ ఇది నా అడ్డ‌’సాంగ్‌ వచ్చేసింది

Eyy bidda idhi naa adda son

డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’ . ఈ సినిమా తొలి భాగం డిసెంబర్‌ 17న విడుదల కాబోతుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌ వేగం పెంచారు మేకర్స్‌. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన దాక్కో దక్కో మేక’, ‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే’ ‘సామీ సామీ’ పాటలు యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నాయి.

తాజాగా ఈ పుష్ప నుంచి నాలుగో పాటను విడుదల చేసింది చిత్ర బృందం.‘ఏ బిడ్డ ఇది నా అడ్డ‌’అంటూ ఈ పాట సాగుతుంది. ఈ సాంగ్‌లో అల్లు అర్జున్‌ గుబురు గ‌డ్డం, పొడ‌వైన జుట్టుతో ఎర్ర‌టి నిలువు బొట్టుతో ఊర మాస్‌ లుక్‌లో కనిపించారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తుంది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ – సునీల్ – అనసూయ భరద్వాజ్ – ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సమంత ఈ చిత్రంలో స్పెషల్‌సాంగ్‌లో కనిపింనుండటం సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu