HomeTelugu Trendingఎఫ్‌-3 రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

ఎఫ్‌-3 రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

F3 movie release date
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎఫ్ 2’. అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో `ఎఫ్ 3` సినిమాను తెరకెక్కిస్తున్నాడు అనిల్‌ రావిపూడి.

అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తోడళ్లులుగా కడుపుబ్బా నవ్వించడానికి వెంకీ, వరుణ్‌ ఇద్దరూ సిద్ధమవుతున్నారు. ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుపుకొంటుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ‘ఎఫ్‌-3’ రిలీజ్‌ డేట్‌ని చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ‘ఎఫ్‌-3’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు దర్శకుడు వెల్లడించారు. ఫుల్‌ టైమ్‌ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. సునీల్ ,రాజేంద్ర ప్ర‌సాద్ కీలక పాత్ర‌లు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. దిత్‌రాజు నిర్మాత.

Recent Articles English

Gallery

Recent Articles Telugu