మెగాస్టార్ బయోపిక్‌ తెరపైకి

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. తక్కువ ఖర్చు పైగా ఎక్కువ లాభం. కథకోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఫాస్ట్ గా సినిమాను పూర్తి చెయ్యొచ్చు. బాలీవుడ్ లో బయోపిక్ లు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు సౌత్ లోను బయోపిక్ లు తీస్తున్నారు. మహానటి సావిత్రి తరువాత ఎన్టీఆర్ బయోపిక్, కత్తి కాంతారావు బయోపిక్ ఇలా వరుసగా వస్తున్నాయి.

అక్కినేని నాగేశ్వర రావు బయోపిక్ విషయంలో అక్కినేని ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది. అక్కినేని బయోపిక్ చేసే అవకాశం లేదని తేల్చేసింది. సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు తెరపైకి మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ చేయాలని వచ్చింది. ఆలోచన బాగుందిగాని, ఎవరు చేయాలి.. ఆ సినిమాలో ఎలాంటి విషయాలను చూపించాలి.

సినిమా ఇండస్ట్రీకి వచ్చే సమయంలో చిరంజీవి చాలా కష్టపడ్డారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన వైనం.. అలాగే అల్లువారి అమ్మాయిని చేసుకున్నాక…. వచ్చిన అవకాశాలు, ఖైదీ సినిమా సమయంలో ఎదుర్కొన్న సమస్యలు.. ఎన్టీఆర్, సూపర్ స్టార్ హవా కొనసాగుతున్న సమయంలో వారికి ధీటుగా ఎలా ఎదిగాడు, చిరంజీవి మెగాస్టార్ గా అనేక సంచలనాలు, రికార్డులు సృష్టించిన తరువాత సడెన్ గా ప్రజారాజ్యం స్థాపించడం.. తిరిగి సినిమాల్లోకి రావడం వంటి అంశాలను కథగా రాసుకొని సినిమా చేస్తే బాగుంటుంది కదా. ఒకవేళ బయోపిక్ చేయాలి అనుకుంటే.. మెగాస్టార్ పాత్రను ఎవరు చేయాలనేది మీమాంశ.