HomeTelugu Trendingప్రమాదంలో కాలిపోయిన జోదా అక్బర్ సెట్

ప్రమాదంలో కాలిపోయిన జోదా అక్బర్ సెట్

Jodha Akbar movie set

2008లో వచ్చిన జోదా అక్బర్ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించారు. ఆ సినిమా కోసం వేసిన రాజమహల్ సెట్, ఇతర సెట్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. అదే సెట్‌లో ఇప్పటివరకు పలు సినిమాల షూటింగ్‌లు జరిగాయి. ఆ సెట్‌ అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది.

ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, ఎన్డీ స్టూడియో యజమాని నితిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. టూరిస్టులను ఎక్కువగా ఆకర్షించే ఈ స్టూడియోలో హాలీవుడ్ స్టూడియోల స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలు కలిగి ఉన్నాయి. అయితే కరోనా కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో కొన్ని నెలలపాటు ఇది మూసివేయబడింది. బాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాలు సైతం ఇక్కడ షూటింగ్‌లు జరుపుతారు. అందమైన జోదా అక్బర్ సెట్ కాలిపోవడంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu