‘మా’ లో మళ్ళీ గొడవలు!

ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో నటుడు నరేష్ ప్యానెల్ గెలిచిన సంగతి తెలిసిందే. ప్రమాణస్వీకారం జరిగిన రోజు నుండే అసోషియేషన్ సభ్యుల నడుమ సరైన సఖ్యత లేదనే విషయం పలు సందర్భాల్లో బయటపడింది. తాజాగా ఉపాధ్యక్షుడైన సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. నిధుల దుర్వినియోగమే ఆయన రాజీనామాకు కారణమని తెలుస్తోంది. ఎన్నికలైన నెల రోజుల్లోనే ఇలా పలు వివాదాలు తలెత్తడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది