HomeTelugu Big Stories'ద‌స‌రా' సాంగ్‌ ప్రోమోను లీక్‌ చేసిన నాని

‘ద‌స‌రా’ సాంగ్‌ ప్రోమోను లీక్‌ చేసిన నాని

First Single promo From Nan
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ద‌స‌రా’. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఈ మూవీ ఫ‌స్ట్ సాంగ్ ధూమ్ ధామ్ దోస్తాన్ ను రేపు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు నాని టీం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అయితే సాంగ్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులు, మూవీ ల‌వ‌ర్స్ కోసం నాని సాంగ్ ప్రోమోను లీక్ చేశాడు.

‘పాట చిత్రీక‌రిస్తున్న‌పుడు నా ఫోన్‌లో రికార్డు చేసిన ఒక విజువ‌ల్‌ను లీక్ చేస్తున్నా..’ అంటూ నాని సాంగ్ ప్రోమోను ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. నాని ఊర‌మాస్ స్టెప్పుల‌తో దుమ్ము లేపే డ్యాన్స్ తో ఇర‌గ‌దీయ‌బోతున్నట్టు లీక్‌డ్ ప్రోమోతో అర్థ‌మ‌వుతుంది. తెలుగుతోపాటు వివిధ‌ భాష‌ల్లో విడుద‌ల కాబోతున్న ద‌స‌రా చిత్రంలో జ‌రీనా వ‌హ‌బ్, సాయికుమార్, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీ ల‌క్ష్మి వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. 2023 మార్చి 30న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!