HomeTelugu TrendingValentine's Day special : నాలుగు ఫీల్ గుడ్ మూవీస్ రీ-రిలీజ్‌

Valentine’s Day special : నాలుగు ఫీల్ గుడ్ మూవీస్ రీ-రిలీజ్‌

Valentines Day special

Valentine’s Day special: ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా.. నాలుగు ఫీల్ గుడ్ లవ్ సినిమాలు థియేటర్లలో రీ-రిలీజ్ కానున్నాయి.
‘ఓయ్’: సిద్ధార్థ్, షామిలీ హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఓయ్’ సినిమా 2009లో రిలీజ్ అయింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఆకట్టుకున్నా.. కమర్షియల్‍గా పెద్ద హిట్ కాలేదు. అయితే, ఆ తర్వాత టీవీల్లో మాత్రం మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమా క్లాసిక్‍గా చాలా మంది మదిలో నిలిచిపోయింది.

ఈ చిత్రం సుమారు 15 ఏళ్ల తర్వాత వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఓయ్ మూవీ థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొన్ని థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఈ మూవీ కోసం యూత్ బాగా వేచిచూస్తున్నారు. యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ కూడా ఈ మూవీకి హైలైట్‍గా నిలిచింది.

సూర్య సన్నాఫ్ కృష్ణన్:
తమిళ స్టార్ హీరో సూర్య ద్వాపాత్రాభినయం చేసిన చిత్రం సూర్య సన్నాఫ్ కృష్ణన్. ఈ
ఇపియా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి మళ్లీ రానుంది. ఈ చిత్రం రీ-రిలీజ్ అవడం ఇది రెండోసారి. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన తమిళ మూవీ వారనమ్ అరియమ్ చిత్రం తెలుగులో ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ 2008లో విడుదలైంది. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. గతేడాది కూడా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రి-రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి వచ్చేస్తోంది.

తొలిప్రేమ:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలి ప్రేమ సినిమా క్లాసిక్ లవ్ మూవీగా నిలిచిపోయింది. కరుణాకరన్ దర్శకత్వంలో 1998లో రిలీజై బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. పవన్‍కు తొలినాళ్లలో సూపర్ హిట్ అందించింది. ఇప్పుడు, తొలి ప్రేమ సినిమా మరోసారి ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వస్తోంది. అయితే, తక్కువ సంఖ్య థియేటర్లలోనే ఈ చిత్రం వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఓసారి ఈ చిత్రం రీ-రిలీజ్ అయింది.

సీతారామం:
2022లో రిలీజైన సీతారామం సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఎమోషనల్ లవ్ స్టోరీతో ఆకట్టుకుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. ఈ సినిమా పాటలు అన్నీ కూడా బాగా పాపులర్ అయ్యాయి.వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ మూవీ రీ-రిలీజ్ కానుంది. హైదరాబాద్‍లోని కొన్ని థియేటర్లలో ఈ చిత్రం రీ-రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu