HomeTelugu Trending'మా' కల త్వరలో నెరవేరనుంది: మంచు విష్ణు

‘మా’ కల త్వరలో నెరవేరనుంది: మంచు విష్ణు

Manchu vishnu about maa ass

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ కల త్వరలో నెరవేరనుందని హీరో మంచు విష్ణు అన్నారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ ఆయన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ట్విటర్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు. ‘మా’కి శాశ్వత భవనం ఉండాలనేది అసోసియేషన్‌లో ఉన్న సభ్యులందరి కల అని.. అది త్వరలో నిజం కానుందని ఆయన అన్నారు. భవనం నిర్మించడం కోసం మూడు స్థలాలు పరిశీలించానని.. వాటిల్లో ఎక్కడ నిర్మించాలనే దానిపై త్వరలోనే అందరం కలిసి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంచు విష్ణు షేర్‌ చేసిన వీడియోతో అందరి దృష్టి మరోసారి ‘మా’ ఎన్నికలపై పడింది.

కాగా ఈ సారి ‘మా’ అధ్యక్ష బరిలో ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, జీవిత, హేమ, నరసింహారావు ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ‘మా’కు శాశ్వత భవనం నిర్మించడం.. అసోసియేషన్‌ సభ్యుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా వీళ్లు పోటీలో దిగుతున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu