HomeTelugu Trendingరికార్డ్ ధరకు రామ్‌చరణ్ గేమ్ చేంజర్ ఆడియో రైట్స్

రికార్డ్ ధరకు రామ్‌చరణ్ గేమ్ చేంజర్ ఆడియో రైట్స్

Game Changer Audio Rights o

రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తొలిసారిగా వస్తున్న మూవీ ‘గేమ్ చేంజర్’. సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ అయిన శంకర్ మొదటిసారి తెలుగు హీరోతో సినిమా చేయడంతో గేమ్ చేంజర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

గేమ్‌ చేంజర్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సంస్థకు 50వ సినిమా కావడం విశేషం.

గేమ్ చేంజర్ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్స్, రామ్ చరణ్ రోల్స్ రూమర్స్ తెగ బజ్ క్రియేట్ చేశాయి.

తాజాగా జరగండి అనే పాట కూడా లీక్ అవడంతో మరోసారి గేమ్ చేంజర్‌పై అందరి ఫోకస్ వెళ్లింది. గేమ్ చేంజర్ సినిమాలోని జరగండి అనే పాటను దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు.

గేమ్ చేంజర్ మ్యూజిక్ హక్కులను ప్రముఖ ఆడియో కంపెనీ సరేగమ సొంతం చేసుకుంది. రూ.33 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం. ఒక్క పాట కూడా విడుదల కాకముందే రికార్డు లెవెల్లో మ్యూజిక్ రైట్స్‌ అమ్ముడు పోవడం హాట్ టాపిక్ అయింది.

పాన్ ఇండియా సినిమాల్లో ఎక్కువ ధర గేమ్ చేంజర్‌కే వచ్చిందని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. గేమ్ చేంజర్ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ మరోసారి జత కట్టనుంది. ఈ మూవీలో చెర్రీ రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరో పాత్రకు అంజలి జోడీ కట్టనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu