‘మనం ఒక్కటయ్యాం’.. సౌందర్య రజనీకాంత్‌ పోస్ట్‌

‘మనం ఒక్కటయ్యాం’ అని సౌందర్య రజనీకాంత్‌ తన భర్త విశాకన్‌ వనగమూడితో అంటున్నారు. వీరి వివాహం చెన్నైలోని ఎంఆర్సీ నగర్‌లో ఉన్న లీలా ప్యాలెస్‌ హోటల్‌లో సోమవారం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతుల్ని ఆశీర్వదించారు. ఇవాళ సాయంత్రం చెన్నైలో వీరి వివాహ విందును ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.

పెళ్లిలో తీసిన కొన్ని ఫొటోలను సౌందర్య ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘శ్రీమతి, శ్రీవారు.. నా కుటుంబం. మనం ఒక్కటయ్యాం. వేద్‌ విశాకన్‌ సౌందర్య’ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశారు. విశాకన్‌ తాళికట్టే సమయంలో సౌందర్య భావోద్వేగానికి గురయ్యారు. ఆమెతోపాటు లతా రజనీకాంత్‌, ఐశ్వర్య ధనుష్‌ కూడా భావోద్వేగానికి గురైనట్లు కనిపిస్తున్నారు. రజనీకాంత్‌ తన కుమార్తెకు ధైర్యం చెబుతున్నారు. అదేవిధంగా సౌందర్య తన స్టైలిస్ట్‌లతో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్‌ చేశారు. తనను అందంగా ముస్తాబు చేసిన వారికి ధన్యవాదాలు చెప్పారు.