HomeTelugu Big StoriesGame Changer: 'జరగండి'.. అంటూ వస్తున్న రామ్‌చరణ్‌

Game Changer: ‘జరగండి’.. అంటూ వస్తున్న రామ్‌చరణ్‌

 

Game changer update to Ram

Game Changer: మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటి వరకూ ఒక్క అప్డేట్‌ కూడా రాలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత రామ్‌ చరణ్‌ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాలో.. రామ్‌చరణ్‌ డ్యూయల్‌ రోల్‌ పోషించబోతున్నారని తెలుస్తుంది. ఓ పాత్రలో సీఎంగా, మరో పాత్రలో ఐఏఎస్‌ అధికారిగా కనిపిస్తారని సమాచారం. ఇక ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

కాగా.. గతంలో గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ‘జరగండి జరగండి..’ అనే ఓ పాట లీక్ అయింది. దీంతో ఆ పాటని గత సంవత్సరం దీపావళికి అఫీషియల్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అది కూడా రిలీజ్ చేయలేదు. దీంతో చరణ్ ఫ్యాన్స్‌ చాలా నిరుత్సాహపడ్డారు.

ఈ నెలలో మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా.. ఈ సినిమా నుంచి ఏమైనా అప్డేట్ ఇస్తారేమో అని ఎంతో ఆసక్తిగా ఉన్నారు అభిమానులు. ఈక్రమంలో మూవీ టీమ్‌ వారికి ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. తాజా సమాచారం ప్రకారం అప్పుడు లీక్ అయిన ‘జరగండి జరగండి..’ సాంగ్ ఇప్పుడు అధికారికంగా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఈ సాంగ్ రిలీజ్ కాబోతూ ఉండడంతో అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. ఎస్‌ జే సూర్య, సునీల్‌, అంజలి, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu