HomeTelugu Big Storiesఇక పై తండ్రి ప్రాతలకు సై.. కరణ్‌ జోహర్‌ వైరల్‌ లుక్

ఇక పై తండ్రి ప్రాతలకు సై.. కరణ్‌ జోహర్‌ వైరల్‌ లుక్

5 5
బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌ జోహర్ ఎన్నో హిట్‌ సినిమాలను అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌‌ కొనసాగడంతో సినీ ప్రముఖులు ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా కరణ్ జోహర్‌‌ ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఇందులో కరణ్‌ కళ్లజోడు పెట్టుకొని తెల్లగా నెరసిపోయిన జుట్టుతో సెల్ఫీ దిగారు. ‘ప్రస్తుతం ఉన్న వైరస్‌ కంటే నా నటన చాలా భయంకరంగా ఉంటుందని తెలుసు. కానీ, రెండో అవకాశం కోసం చూడటం ఏమాత్రం హానికరం కాదు. అందుకే దర్శకనిర్మాతలకు ఒక ప్రకటన చేస్తున్నాను. ప్రేక్షకులను అలరించడానికి నేను తండ్రి పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటూ ఆయన కామెంట్‌ టాగ్‌ చేశారు.

ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కరణ్‌ పోస్ట్‌ చేసిన ఫొటోపై సినీ ప్రముఖులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మీ మెయింటెనెన్స్ హీరోయిన్‌ కంటే ఎక్కువగా ఉంటుంది’ అని దర్శకనిర్మాత ఫరాఖాన్‌ సరదాగా కామెంట్‌ చేశారు. ‘చక్కటి పౌట్‌ పోజ్‌తో ఓ ఫాదర్‌’ అంటూ హీరోయన్‌ కృతి సనన్‌ కామెంట్‌ చేశారు. అదేవిధంగా మీ లుక్‌ బాగుందని నటి శిల్పాశెట్టి ట్వీట్‌ చేశారు. కరణ్‌ చివరగా ‘బాంబే వెల్వెట్’‌ చిత్రంలో కనిపించారు. అదేవిధంగా షారూఖ్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘దిల్‌వాలే దుల్హానియా లే జయేంగే’ సినిమాలో కరణ్‌ నటించిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu