HomeTelugu Trendingస్కంద: గండరబాయ్‌ సాంగ్‌ విడుదల

స్కంద: గండరబాయ్‌ సాంగ్‌ విడుదల

Gandarabai Lyrical Video f

ఎనర్జిటిక్ హీరో రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం స్కంద. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాట మరియు పోస్టర్‌లకు మంచి స్పందన వస్తుంది. ఈ క్రమంలో సెకండ్‌ సింగిల్‌ను రిలీజ్‌ చేశారు.

గండరబాయ్ గండరబాయ్ గందరగోళంలో పెట్టకమ్మాయ్.. గండరబాయ్ గండరబాయ్ గత్తర కౌగిట్లో సుట్టకమ్మయ్ అంటూ సాగే ఈ సాంగ్‌ను అనంత్ శ్రీరామ్‌ రాశారు. ఎస్ థమన్ కంపోజిషన్‌లో నకాశ్‌ అజీజ్‌, సౌజన్య భాగవతుల పాడారు. ప్రేమ్‌ రక్షిత్‌ డ్యాన్స్ కంపోజిషన్‌లో రామ్‌, శ్రీలీల అదిరిపోయే స్టెప్పులేశారు. ఈ పాటను తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ, హిందీ భాషల్లో విడుదల చేశారు.

ఈ సినిమా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేస్తున్నట్టు తెలిపారు మేకర్స్‌‌. RAPO20 చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్స్ ప‌తాకంపై ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu