HomeTelugu Trending'గాండీవధారి అర్జున' ట్రైలర్

‘గాండీవధారి అర్జున’ ట్రైలర్

Gandeevadhari Arjuna Traile

మెగా ప్రీన్స్‌ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వస్తున్నఈ సినిమా, ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌ జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

యాక్షన్‌, ఛేజింగ్, ఎమోషన్స్, సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఉత్కంఠను పెంచుతోంది. యాక్షన్ సీన్స్ ను ఒక రేంజ్ లో డిజైన్ చేశారనే విషయం ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఫారిన్ లొకేషన్స్ లోనే కథను పరిగెత్తించారనే విషయం అర్థమవుతోంది.

‘భూమికి పట్టిన అతిపెద్ద కేన్సర్ మనిషేనేమో’ అంటూ నాజర్ చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది. మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu