HomeTelugu Trendingతమిళ దర్శకుడు సూర్య కిరణ్‌ కన్నుమూత

తమిళ దర్శకుడు సూర్య కిరణ్‌ కన్నుమూత

Tamil director Surya Kiran

తమిళ దర్శకుడు సూర్య కిరణ్‌ కన్నుమూశారు. టాలీవుడ్‌లో సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. కామెర్ల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించారని తెలుస్తోంది.

‘మాస్టర్‌ సురేష్‌’ పేరుతో 200లకు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించిన ఆయన తెలుగు బిగ్‌ బాస్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ కళ్యాణిని ప్రేమ పెళ్లి చేసుకున్న సూర్య కిరణ్‌ పలు మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్నాడు.

బాలనటుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు అవార్డులను అందుకున్న సూర్య కిరణ్‌.. దర్శకుడిగా రెండు నంది పురస్కారాలను అందుకున్నాడు. సూర్యకిరణ్‌ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. రేపు ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu