HomeTelugu Trendingమంచు విష్ణు 'జిన్నా'కు స్టార్‌ కొరియోగ్రాఫర్‌ కొరియోగ్రఫీ!

మంచు విష్ణు ‘జిన్నా’కు స్టార్‌ కొరియోగ్రాఫర్‌ కొరియోగ్రఫీ!

Ganesh acharya to choreogra
మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌, సిన్నీలియోన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా ఈ మూవీ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ‘జిన్నా’ లోని ఓ పాటకు కొరియోగ్రఫీ అందించాడట. ఈ సినిమాలోని ఓ పాటకు ఇప్పటికే ఇండియన్‌ మైకెల్‌ జాక్సన్‌ ప్రభుదేవ కొరియోగ్రఫీ అందించగా తాజాగా ఓ సాంగ్‌ను బాలీవుడ్ స్టార్ కొరియోగ్ర‌ఫ‌ర్ స్టార్‌ కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్య స్టెప్స్‌ సమకూర్చాడు. హీరో విష్ణు, పాయల్‌, సన్నీలియోన్‌ల మధ్య సాగే ఓ పార్టీ సాంగ్‌కు ఆయన కొరియోగ్రఫి అందించినట్లు తెలుస్తుంది.

ఎంగేజ్‌మెంట్‌ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ పాట సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఈ సినిమా మేకింగ్‌ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్‌ కాకుండ ప్రభుదేవ, గణేశ్‌ ఆచార్య, ప్రేమ్‌ రక్షిత్‌ వంటి స్టార్‌ కొరియోగ్రాఫర్లతో పాటలను రూపొందించి సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు మేకర్స్‌. డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవరామ్ భక్త మంచు సమర్పణలో 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై విష్ణు మంచు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేతో పాటు క్రియేట్‌ ప్రొడ్యూసర్‌గా కోన వెంకట్‌ వ్యవహరిస్తుండగా.. చోటా కే నాయుడా కెమెరా మ్యాన్‌గా పని చేస్తున్నాడు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!