HomeTelugu Trending'భళా తందనాన' నుండి గరుడ రామ్‌ ఫస్ట్‌లుక్‌

‘భళా తందనాన’ నుండి గరుడ రామ్‌ ఫస్ట్‌లుక్‌

Garuda ram anand baali firs
టాలీవుడ్‌ యంగ్‌ హీరో శ్రీవిష్ణు, చైతన్య దంతులూరి డైరెక్షన్‌లో వస్తున్న వైవిధ్యమైన చిత్రం ‘భళా తందనాన’. ఈ చిత్రంలో కేథరిన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈమూవీ షూటింగ్‌ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో విలన్‌గా కేజీఎఫ్‌ ఫేం రామచంద్రరాజు(గరుడ) నటిస్తున్నాడు. అయితే ఈ రోజు రామచంద్రరాజు పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీలో ఆయన ఫస్ట్‌లుక్‌ విడుదలైంది.

అంతేగాక ఈ సందర్భంగా అతడి పాత్రను కూడా మూవీ యూనిట్‌ వెల్లడించింది. ఆనంద్‌ బలిగా.. గరుడ రామ్‌ అంటూ చిత్ర బృందం ఫస్ట్‌లుక్‌ను షేర్‌ చేసింది. ఇందులో గడ్డంతో ఉన్న రామ్‌ను చూస్తుంటే ఆనంద్‌ బలిగా పవర్‌ ఫుల్‌ విలన్‌ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సాయి కొర్రపాటి వారాహి చలన చిత్ర బ్యానర్‌పై రజనీ కొర్రపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీత అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu