HomeTelugu Trendingఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి: వీడియో సాంగ్‌ విడుదల

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి: వీడియో సాంగ్‌ విడుదల

Aa Merupemito song from Aa

సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా విడుదలకి ముస్తాబై కొంతకాలమవుతున్నా, సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తూ.. వచ్చింది. సుధీర్ బాబు జోడీగా కృతి శెట్టి నటించిన ఈ సినిమాను, సెప్టెంబర్ 16వ తేదీన విడుదల చేయనున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నేపథ్యంలో కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. ‘ఆ మెరుపేమిటో .. కనుపాపతో ఏమన్నదో’ అంటూ ఈ పాట సాగుతోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.

తాను మనసుపడిన అమ్మాయిని తలచుకుంటూ .. ఆమె అనుభూతుల్లో హీరో తేలియాడే సందర్భంలోనిది ఈ పాట. మెలోడీనీ కొత్తగా ట్యూన్ చేసిన తీరు మరింత ఫీల్ ను తీసుకొచ్చిందనే చెప్పాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu