పుష్పక్ – జేబీ హెచ్ ఆర్ ఎన్ కె ఎల్ సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ‘గీత సాక్షిగా’ రూపొందుతోంది. ఆంథోని మట్టిపల్లి డైరెక్షన్‌లో చేతన్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. గోపీ సుందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్స్ విడుదల చేసినప్పటి నుండి ప్రేక్షకులలో ఆసక్తితో పాటు అంచనాలను పెంచుతూ విశేషంగా ఆకట్టుకుంటోంది.
తాజాగా ఈ సినిమా నుండి ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ తో మరో అద్భుతమైన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే ఇది కోర్ట్ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తుంది. రాజా రవీంద్ర, లాయర్ శ్రీకాంత్ అయ్యంగార్, పోలీస్ ఆఫీసర్ ఇలా ముగ్గురూ కలసి నటుడు ఆదర్శ్ ను టార్గెట్ చేసినట్లు టీజర్ లో కనిపిస్తోంది. శ్రీకాంత్ అయ్యంగార్, రూపేష్ శెట్టి, భరణి శంకర్, జయలలిత, అనిత చౌదరి, రాజా రవీంద్ర లతో పాటు అనేకమంది సీనియర్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.