‘అజ్ఞాతవాసి’ ఆడియో వచ్చేస్తుంది!

ఈ మధ్య ఆడియో ఫంక్షన్లకు బదులుగా పాటలను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేసి సినిమా విడుదలకు ముందు ప్రీరిలీజ్ ఫంక్షన్ చేయడం కామన్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఓ పెద్ద ఆడియో ఫంక్షన్ జరగబోతుంది. పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఆడియో ఫంక్షన్ డిసంబర్ మొదటి వారంలో నిర్వహించనున్నారు. ఈరోజు త్రివిక్రమ్ పుట్టినరోజు కానుకగా ఒక పాటను విడుదల చేశారు. కానీ మిగిలినవి అన్నీ కలిపి ఒకేసారి ఆడియో ఫంక్షన్ లో విడుదల చేస్తారని తెలుస్తోంది.

అలానే పవన్ యూరప్ షూటింగ్ పూర్తి చేసుకొని మరో వారం రోజుల్లో ఇండియా రానున్నారు. రాగానే సినిమా టైటిల్ అనౌన్స్ చేయనున్నారు. ఇప్పటికే 150 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత మరిన్ని రికార్డ్స్ సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.