HomeTelugu Trending'గీతాంజలి' మళ్లీ వచ్చింది

‘గీతాంజలి’ మళ్లీ వచ్చింది

geethanjali 2 shooting upda
తెలుగమ్మాయి అంజలి నటించిన ‘గీతాంజలి’ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తొమ్మిదేళ్ల కిందట విడుదలైన ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్‌ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. హార్రర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాను ప్రముఖ రైటర్‌ కోన వెంకట్‌ నిర్మించాడు.

ఇక తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించారు. గీతాంజలి మళ్లీ వచ్చింది అంటూ టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఓ పాడుబడిపోయిన బంగ్లాలో తెల్లని దుస్తులు దరించి అటు వైపు తిరిగి ఉన్న అంజలి పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. ఇది అంజలికి 50వ సినిమా.

ఇంత త్వరగా ఒక హీరోయిన్‌ 50 సినిమాలు కంప్లీట్‌ చేసుకుందంటే విశేషం అనే చెప్పాలి. ఓ వైపు హీరోయిన్‌గా.. మరో వైపు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అంజలి బిజీ బిజీగా గడుపుతుంది. ఇక ఈ సినిమా కూడా కోన వెంకట్‌ సమర్పణలోనే తెరకెక్కుతుంది.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu